ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంత పెద్ద స్టార్ హీరో నటించాడు , ఎంత చిన్న హీరో నటించాడు. సినిమా బడ్జెట్ ఏమిటి ..? సినిమా జోనర్ ఏమిటి అనే దానితో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు. దానితో స్టార్ హీరోలు నటించిన సినిమాలతో పోలిస్తే మంచి టాక్ వచ్చినట్లయితే చిన్న సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. దానితో పెద్ద పెద్ద నిర్మాతలు కూడా తక్కువ బడ్జెట్లో చిన్న హీరోలతో , చిన్న దర్శకులతో సినిమాలను రూపొందిస్తూ వస్తున్నారు. ఇకపోతే కొన్ని సందర్భాలలో పెద్ద క్రేజ్ ఉన్న హీరో నటించిన సినిమా విడుదల అయ్యి అతనితో పాటు పెద్దగా క్రేజ్ లేని చిన్న నటుడు నటించిన సినిమా విడుదల అయిన స్టార్ హీరో నటించిన సినిమాకు మంచి టాక్ రానట్లయితే చిన్న హీరో నటించిన సినిమాకు మంచి టాక్ వస్తే చిన్న హీరో సినిమాకే మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా మొదటి వారం రోజులు కూడా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేదు. ఈ వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఈ వారం చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. దానితో మాస్ జాతర మూవీ కి ఈ వారం కూడా కాస్త మంచి కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ వారం విడుదల అయిన సినిమాలలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో చాలా మంది ఈ చిన్న సినిమా వల్ల మాస్ జాతర మూవీ కి రెండో వారం పెద్ద స్థాయి కలెక్షన్లు రావు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt