- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద బజ్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి బన్నీ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. అట్లీ, తన మార్క్ మాస్ యాక్షన్ సినిమాలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు. మరి అలాంటి అట్లీ - బన్నీ కలయిక అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పడుకొణే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మృణాల్‌పై కీలక సన్నివేశాన్ని షూట్ చేస్తార‌ని స‌మాచారం.


ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ - జాన్వీ కపూర్‌లపై ఓ లవ్ ట్రాక్ షూట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత షెడ్యూల్‌లో దీపికా షూట్‌లో జాయిన్ కానుంది. అట్లీ శైలికి తగ్గట్టుగా ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా, ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కుతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ లుక్, యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని టాక్. బన్నీ ఇప్పటివరకు చూడని ఒక మాస్ అండ్ ఇన్‌టెన్స్ అవతారంలో కనపడనున్నాడని సమాచారం.


కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అల్లు అర్జున్ డాన్ పాత్రలో అలరిస్తాడట‌. ఆయన పాత్రలో ఎమోషన్, పవర్ రెండూ సమానంగా మిక్స్ చేశాడ‌ట అట్లీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెర‌కెక్కుతోంది. అట్లీ ప్రత్యేకంగా కొన్ని గెస్ట్ రోల్స్ కోసం స్టార్ నటులను అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. ఆ గెస్ట్ రోల్స్‌లో ఎవరు కనిపించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఫైన‌ల్‌గా ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందనే టాక్ ఇండస్ట్రీ అంతా వినిపిస్తోంది. అట్లీ మార్క్ మాస్ యాక్షన్, బన్నీ ఎనర్జీ కలిస్తే… బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు తప్పవని బ‌న్నీ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: