తమన్నా ఎప్పటికీ ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించేందుకు జిమ్‌లో కష్టపడుతూ, కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను పాటిస్తుంది. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించే టోన్‌డ్ బాడీ, గ్లోయింగ్ లుక్స్ చూస్తే, యువ హీరోయిన్లకే కాదు, అభిమానులకూ ప్రేరణగా మారుతోంది.అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమన్నా బరువు తగ్గడానికి “ఓజెంపిక్” (వంటి ఇంజెక్షన్లు వాడుతుందనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ వార్తలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిన నేపథ్యంలో, తాజాగా మిల్కీ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ ప్రచారాలను పూర్తిగా ఖండించింది.
ఆమె స్పష్టంగా మాట్లాడుతూ —“నాకు 15 ఏళ్ల వయసు నుంచే కెమెరా ముందు కనిపిస్తున్నాను. మొదట్లో నేను ఎలా ఉన్నానో, ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా ఎదుగుదలని ప్రజలు కళ్లారా చూశారు. దాచాల్సింది ఏమీలేదు. నేను సహజంగానే సన్నగా ఉన్నాను; ఎలాంటి ఇంజెక్షన్లు వాడటం వల్ల కాదు. నా శరీరంలో ఏ మార్పులు వచ్చినా అవి సహజమైనవి మాత్రమే,” అని తమన్నా వివరించింది. అలాగే ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న శారీరక, మానసిక మార్పుల గురించి కూడా ఓపెన్ గా చెప్పింది —“ప్రతి మహిళా శరీరంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి సహజ మార్పులు జరుగుతాయి. మనం మనలోని కొత్త వెర్షన్‌ను ఆమోదించుకోవాలి. కోవిడ్ కాలంలో నా శరీరం చాలా ప్రభావితమైంది. 20 ఏళ్ల వయసులో ఉన్న ఫిట్‌నెస్‌ను అలాగే కొనసాగించడం కష్టమైపోయింది. బరువు పెరిగాను, దాంతో శరీరంలో మార్పులు వచ్చాయి. అద్దంలో చూసుకుని ‘నా కడుపు కనిపిస్తోందా?’ అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ సమయంలో చాలా మనోవేదన అనుభవించాను. కానీ ప్రతి మహిళలా నేనూ కూడా సహజ మార్పులను అంగీకరించాను,” అని ఆమె చెప్పింది.
ఇంటర్వ్యూలో చివరగా తమన్నా మీడియాలో ప్రచారమవుతున్న అబద్ధపు వార్తలపై ఆవేదన వ్యక్తం చేసింది.“దయచేసి నిర్ధారణ లేకుండా, వాస్తవం తెలియకుండా ఇలాంటి రూమర్లు ప్రచారం చేయకండి. నేను ఎప్పటికీ సహజమైన మార్గాల్లోనే ఆరోగ్యంగా ఉండటానికి కృషి చేస్తాను. ఫిట్‌నెస్ అంటే నాకు ఫ్యాషన్ కాదు, అది నా జీవన విధానం,” అని చెప్పి ఇంటర్వ్యూను ముగించింది.ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు, తమిళ భాషల్లో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ మధ్య కూడా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, అభిమానులతో తరచుగా ముచ్చటిస్తోంది. ఎప్పటికీ యంగ్‌గా, ఉత్సాహంగా కనిపించే ఈ మిల్కీ బ్యూటీ నిజంగానే కాలాన్ని జయించిన అందం అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి