తాజాగా శర్వానంద్ ఇన్ డైరెక్ట్ గానే ఈ విషయం గురించి మాట్లాడారు.. ఇటీవల చాలా స్లిమ్ముగా మారి బక్క చిక్కిన బాడీతో కనిపించిన శర్వానంద్ సిక్స్ ప్యాక్ బాడీతో అందరిని ఆకట్టుకున్నారు. తన లుక్ పైన మాట్లాడుతూ తన విడాకుల గురించి కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను తండ్రి అయ్యాకే ఆరోగ్యం పైన చాలా దృష్టి పెట్టాను, అంతకుముందు ఎక్కువగా వర్క్ అవుట్ చేసేవాడిని కాదు నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, చాలా దృఢంగా ఉండాలని డిసైడ్ అయ్యానని తెలిపారు.
2019లో తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత 92 కేజీల వరకు బరువు పెరిగానని చాలా కష్టపడి 22 కేజీల వరకు తగ్గాను అంటూ తెలియజేశారు శర్వానంద్. ముఖ్యంగా తన కుటుంబం కోసమే తాను ఆరోగ్యంగా ఉండాలని చెప్పడంతో శర్వానంద్ విడాకుల వ్యవహారాన్ని కొట్టి పారేసినట్టుగా కనిపిస్తోంది.. చివరిసారిగా 2024 లో మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని మూటకట్టుకున్నారు. ప్రస్తుతం బైకర్, నారి నారి నడుమ మురారి, భోగి వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు శర్వానంద్. ఈ సినిమాలతోనైనా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి