ఇకపోతే, రిలీజ్ డేట్‌కు కేవలం మూడువారాలు (23 రోజులు) మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తక్కువ టైమ్‌లోనే అఖండ 2 టీమ్ అన్నీ ఫినిష్ చేసి ప్రమోషన్స్‌ను రాకెట్ స్పీడ్‌లో పూర్తి చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా రిలీజ్. కేవలం తెలుగు కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మార్కెట్లలో కూడా భారీగా బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో సినిమా గ్యాప్‌ను “చికిరి చికిరి” సాంగ్ తీర్చేసింది. ఆ పాటకు చరణ్ డాన్స్, ఏఆర్ రెహమాన్ వైబ్స్ కలిసిపోవడంతో నార్త్ నుంచి సౌత్ దాకా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్థాయిని అఖండ 2 తాండవం సాంగ్ అందుకోవాలి. తమన్ మాటల ప్రకారం పాట ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్‌కు అదే స్టార్ట్‌పాయింట్ అవుతుంది.
ఇక యూనిట్ లోపల టాక్ ప్రకారం – “సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది” అంటున్నారు. కానీ ఆ ఎమోషన్ పబ్లిక్ కి రీచ్ కావాలంటే, సరైన ఆల్బమ్, టీజర్, ట్రైలర్ చాలా కీలకం. అందుకే రాబోయే మూడు వారాల్లో బోయపాటి, బాలయ్య, తమన్ త్రయం అగ్నిదేవుడి వేగంతో పరిగెత్తబోతున్నారని టాక్. అదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో గట్టిగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. "మాస్ ఈజ్ బ్యాక్" అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ కూడా రిలీజ్ ముందురోజు ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోందట. "ఓజీ" తరహాలో స్పెషల్ షోలు వేస్తే హైప్ ఇంకా రెట్టింపు అవుతుందని బోయపాటి టీమ్ భావిస్తోంది. కేజీఎఫ్, పుష్ప, బాహుబలి, కాంతార తరహాలో సీక్వెల్ మొదటి పార్ట్‌ను మించిపోయేలా హిట్టవ్వాలని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. “అఖండ 2” అదే స్థాయిలో తాండవం చేస్తే, అది బాలయ్య కెరీర్‌లో కొత్త యుగం అవుతుంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి