ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అందరికీ చేరవేయడం కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు జియో సినిమా మరియు హాట్‌స్టార్‌లు ఈ ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ఈవెంట్ కోసం ప్రత్యేకంగా అలంకరించబడుతున్నదని, దేశంలోనే అతి పెద్ద ప్రీ-టీజర్ లాంచ్ ఈవెంట్‌గా నిలవబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.తాజాగా ప్రియాంక చోప్రా తన అభిమానులతో "ఆస్క్ మీ ఎనీథింగ్" సెషన్‌లో పాల్గొని, కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి గారితో పనిచేయడం తన కెరీర్‌లో ఒక గొప్ప అనుభవమని చెప్పిన ఆమె, ఆయన సహకారంతో తాను తెలుగు భాషను చాలా క్లియర్‌గా మాట్లాడగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేసింది.
తెలుగు తన మాతృభాష కాకపోయినా, తన డైలాగ్స్ తానే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, రాజమౌళి గారి పర్యవేక్షణలో తాను చాలా నేర్చుకుంటున్నానని ప్రియాంక తెలిపారు. ఆమె మాటల్లో, “రాజమౌళి సర్ ఒక విజనరీ. ఆయన సెట్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన అనుమతి లేకుండా ఎవరూ సినిమాలోని ఒక్క సీన్ గురించీ బయటకు చెప్పరు,” అని చెప్పింది. అయితే, గతంలో ప్రభాస్ – రానా లాంటి హీరోలు బాహుబలి సెట్లో, అలాగే ఎన్టీఆర్ – రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ సమయంలో కూడా ఒక్క విషయం బయటకు వెల్లడించలేదు. కానీ ఈసారి మాత్రం, ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కొన్ని రహస్య విషయాలను బయటపెడుతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి