గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నాగార్జున నటించిన శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేసింది చిత్ర చిత్ర బృందం . ఎట్టకేలకు నిన్నటి రోజున భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అభిమానులను మరొకసారి ఖుషీ చేసింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించినటువంటి నటుడు చిన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ముఖ్యంగా తనకు జరిగిన షూటింగ్ అనుభవాల గురించి తెలియజేశారు.


ముఖ్యంగా తాను అమ్మోరు సినిమాలో నటించిన తర్వాత చాలా మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేశారు చిన్నా. మొదట ఆర్టిస్టుగా ట్రై  వేస్తున్నప్పుడు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆఫీసులో తాను ఉన్నానని ఆయన వల్లే ఒకటి రెండు చిత్రాలలో చిన్న చిన్న వేషాలలో నటించాను. కానీ (మనీ, రాత్రి) వంటి చిత్రాలలో హీరోగా నటించానని. ఆ సమయంలోనే అమ్మోరు సినిమాలో విలన్ గా  నటించే అవకాశం వచ్చింది.అందుకు సంబంధించి డైరెక్టర్ మేలేటి రామారావు కూడా తనకు కథ చెప్పిన తర్వాత గెటప్ ఎలా ఉంటుందనే విషయంపై కొన్ని సీన్స్ చూపించారని తెలిపారు చిన్నా.


షూటింగ్ గ్రాఫిక్స్ అంతా అయిపోయింది డబ్బింగ్ మాత్రమే చెప్పాలి.. ఖాజాగూడ ప్రాంతంలో ఉండే కొండమీద ఒక నెలరోజుల పాటు క్లైమాక్స్ ని పూర్తి చేశామని ఈ సినిమా కోసం 500 రోజులు కష్టపడ్డానని తెలిపారు. ఈ సినిమా అయిపోయే వరకు మరే సినిమాలో కూడా నటించలేదని.. ఒక్క సీను కోసం 72 గంటల పాటు పద్మాలయ స్టూడియోలో నిద్రపోకుండా పనిచేశానని తెలిపారు చిన్నా. అయితే ఈ సినిమా అంతా అయిపోయిన  ఫుటేజ్ చూసి  డైరెక్టర్ డిసప్పాయింట్ అయ్యారు . ఆ తర్వాత కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లారు. ఫుటేజ్ అంతా చూసి చిన్నా విలన్ ఏంటి? ఈ సినిమాను నేను చేయలేని చెప్పడంతో.. ఏం చేయాలి అనే ప్రశ్న వేసినప్పుడు.. చిన్నా మార్చి అందులో రామిరెడ్డిని విలన్ గా తీసుకున్నారు. సుమారుగా ఏడాది పైన వరకు కష్టపడి నటిస్తే తనను తీసేసారని తెలిసి ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్దాం అనుకున్నాను.. లోలోపల చాలా బాధపడే వాడిని.. కానీ ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు వచ్చాయి.. సరే కదా మన వృత్తి ఇదే అని చాలా సినిమాలలో నటించిన ఆ బాధ మాత్రం అలాగే ఉండేదని తెలిపారు. అమ్మోరు చిత్రం కోసం వర్మ గాయం సినిమాను కూడా వదిలేసుకున్నానని తెలిపారు చిన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: