తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు.. అలాంటి ఈయన మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా చేస్తున్నారు. మొన్నటి వరకు వీరి కాంబినేషన్లో సినిమా గురించి కనీసం బయట పెట్టని రాజమౌళి తాజాగా వీరి సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ని హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పేరు వారణాసి అని పెట్టారు. అయితే హైదరాబాదులో వేలాదిమంది మహేష్ బాబు అభిమానుల మధ్య ఈ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి స్టోరీ రాసినటువంటి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. సీజి లేదు, బిజీఏం లేదు, ఎలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు..

 అయినా మహేష్ బాబు లుక్ అందరినీ అదరగొట్టింది. నేను ఆ సీన్లు చూస్తున్నంత సేపు అలా మంత్రముగ్ధుడిని అయిపోయాను. రాజమౌళి స్క్రీన్ ప్రజెన్స్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు లుక్ అలా చూస్తూ ఉంటే నాకు వేరే లోకం వెళ్ళినట్టు అనిపించింది. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు కానీ కొన్ని కొన్ని సినిమాలను దేవుళ్లే  చేయించుకుంటారా అనే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. రాజమౌళి గుండెల్లో హనుమాన్ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏం చేయాలో రాజమౌళితో చేయించుకుంటున్నారని విజయేంద్రప్రసాద్ పొగిడారు.

అయితే విజయేంద్ర ప్రసాద్ మాటలు చూస్తే మాత్రం ఈ సినిమా ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిజిఎం గ్రాఫిక్స్ ఏవి యాడ్ చేయకముందే సీన్స్ ఈ విధంగా ఉన్నాయి అంటే ఇక అన్ని యాడ్ చేస్తే  సినిమా ఏ విధంగా ఉండబోతుందో ఊహకు కూడా అందేలా లేదు.. ఈ విధంగా విజయేంద్రప్రసాద్ మహేష్ బాబు వారణాసి సినిమా గురించి అద్భుతమైన కామెంట్లు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ, కార్తికేయ లు కలిసి నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: