ఇదే విషయంపై రాజమౌళి కూడా తీవ్ర అసహనానికి గురయ్యారని, ఆ కోపంతోనే ఇటీవల స్టేజ్‌పై మాట్లాడుతుండగా ‘దేవుడు ఉన్నాడా?’ అని టంగ్ స్లిప్ అయ్యారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనపై పోలీస్ కేసు నమోదయ్యిందనే వార్త కూడా వైరల్‌గా మారింది. మా నన్న హనుమతుడు వెనుక ఉండి నడిపిస్తాడు అంటాడు.. నా భార్య ఆ హనుమంతుడినే నమ్ముతుంది..ఇదే నా ఆయన నడిపించడం అంటే అని ఘాటూగా రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో ‘వారణాసి’ టైటిల్ కూడా ఒరిజినల్ కాదని, ఆ పేరును ఇప్పటికే మరొకరు రిజిస్టర్ చేసుకున్నారని వివాదం రేపుతూ ఫిల్మ్ చాంబర్‌లో కేసు నమోదవడం మరొక పెద్ద సమస్యగా మారింది.
ఇలా ఒక్క సినిమాకే వరుసగా నెగిటివ్ షాకులు రావడంతో, రాజమౌళికి ఇది పెద్ద శాపం లాంటి పరిస్థితిని తీసుకొస్తోందని కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి దేవుడిని నమ్మని వ్యక్తి కాబట్టి ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని, దేవుడు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనే సంకేతాలు ముందే ఇస్తున్నాడని, అందుకే ఈ రకమైన ఘటనలు బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయని రకరకాలుగా మాట్లాడుతున్నారు.మరోవైపు, ఈ వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమని, రాజమౌళి స్థాయి దర్శకుడి సినిమా కోసం ఇలాంటి చిన్న ట్రోల్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని మరికొందరు అంటున్నారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘వారణాసి’ గురించే చర్చ నడుస్తోంది, అది కూడా ఎక్కువగా నెగెటివ్ వైపు వెళ్లడం హాట్ గా మారింది..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి