గ్లోబ్ ట్రాటర్ లో రాజమౌళి చేసిన ఒకే ఒక్క కామెంట్ ఆయనపై తీవ్ర విమర్శలను గుప్పిస్తోంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో గ్లింప్స్ టెక్నికల్ ఇష్యూ వల్ల కాస్త లేట్ అయ్యేసరికి మా నాన్న నా వెనక ఉండి హనుమంతుడు నడిపిస్తాడు అంటారు. కానీ నా వెనక హనుమంతుడు ఉంటే ఇలానేనా జరిగేది.. అసలు నాకు దేవుడిపై నమ్మకం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాజమౌళి మాట్లాడిన వ్యాఖ్యలు అక్కడున్న వారికి సిల్లీ గానే అనిపించినప్పటికీ హిందువులని మాత్రం తీవ్రంగా హర్ట్ చేశాయి.. అంతే కాదు గతంలో రాజమౌళి నాకు రాముడు అంటే ఇష్టం లేదు..కృష్ణుడు అంటే ఇష్టం అని పెట్టిన ట్వీట్ కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అవ్వడంతో చాలామంది హిందువులు రాజమౌళిపై ఫైర్ అవుతున్నారు.దేవుళ్ళ మీద సినిమాలు తీస్తూ కోట్లు సంపాదిస్తున్న నీకు దేవుళ్ల విలువ ఏం తెలుస్తుంది అంటూ మండి పడుతున్నారు.

 ఇప్పటికే హిందువులతో పాటు బిజెపి నేతలు అంతా కూడా రాజమౌళి పై విమర్శలు చేశారు. ఈ నేపద్యంలోనే తాజాగా బిజెపి నేత చీకోటి ప్రవీణ్ కూడా రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేశారు.మదమెక్కిన ఏనుగు నీ పతనం ఖాయం అంటూ చీకోటి ప్రవీణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ చీకోటి ప్రవీణ్ రాజమౌళి గురించి చేసిన ఆ కామెంట్లు ఏంటి అనేది చూస్తే.. మదమెక్కిన ఏనుగు మురికి కాలువలో పడ్డట్టే రాజమౌళి తీరు కనిపిస్తోంది.. ఇన్ని విమర్శలు వస్తున్నా రాజమౌళి ఎందుకు స్పందించడం లేదు. హిందువులకు ఎందుకు క్షమాపణలు చెప్పడం లేదు.

వెంటనే రాజమౌళి మీడియా ముందుకు వచ్చి హిందువులకు క్షమాపణలు చెప్పాల్సిందే.. దేవుళ్ళ పేరు చెప్పుకొని సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తూ ఆ దేవుళ్ళని అవమానిస్తే బాగోదు..వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాల్సిందే..అహంకారంతో వెళితే నీ పతనం ఖాయం అంటూ సంచలన కామెంట్స్ చేశారు చీకోటి ప్రవీణ్. మరి ఇంతమంది విమర్శలు చేసినా కూడా రాజమౌళి ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను చేసిన వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెబుతున్నాను.. వెనక్కి తీసుకుంటున్నానని ఎందుకు స్పందించడం లేదు అననే చర్చ కూడా నడుస్తుంది.మరి ఇప్పటికైనా రాజమౌళి స్పందించి హిందువులకు క్షమాపణలు చెబుతారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: