రామ్ పోతినేని హీరోగా ..భాగ్యశ్రీ బోర్సే  హీరోయిన్ గా.. ఉపేంద్ర కీ రోల్ పోషించిన తాజా మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా.. మహేష్ బాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, పాటలు, పోస్టర్ టీజర్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ గా ఉపేంద్ర నటించగా.. ఆయన అభిమాని పాత్రలో రామ్ పోతినేని నటించారు. అయితే చాలామంది ఆంధ్రా కింగ్ పాత్రలో ఉపేంద్రని తీసుకోవడంతో కొన్ని విమర్శలు చేశారు. మన తెలుగులో హీరోలు ఎవరూ లేరా.. ఉపేంద్రనే అందరికంటే గొప్ప నా అన్నట్లు పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉపేంద్రని ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మహేష్ బాబు. తాజాగా సినిమా విడుదలకు ముందు బెంగళూరులో కన్నడ భాషలో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. 

సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. చాలామంది ఆంధ్రా కింగ్ గా ఉపేంద్రని ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారు.ఉపేంద్రని ఆంధ్రా కింగ్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం అన్ని భాషల ప్రజలు ఆయన్ని ఓన్ గా తమ హీరోగా అనుభూతి పొందుతారు. మలయాళం,తెలుగు,కన్నడ, తమిళ ఇలా ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా తమ సొంత హీరో అని అందరూ యూనిక్ గా ఫీల్ అయ్యే హీరో ఉపేంద్ర గారే.. ఈ సినిమాలో ఉపేంద్ర గారు పోషించిన క్యారెక్టర్ పోషించడానికి అండర్స్టాండింగ్,ఒక రకమైన ఫిలాసఫీ కావాలి.వీటన్నింటికీ కరెక్ట్ గా ఉపేంద్ర గారే సెట్ అవుతారని నేను భావించాను. మిగిలిన హీరోలెవరు ఈయన పోషించిన పాత్ర పోషిస్తారని నేను అనుకోవడం లేదు. అందుకే ఉపేంద్ర గారిని తీసుకున్నాను అంటూ డైరెక్టర్ మహేష్ బాబు చెప్పుకొచ్చారు..

సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇందులోని ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు.. ఈ సినిమాని కేవలం సినీ అభిమానుల కోసమే తీశాను కథ స్క్రీన్ ప్లే కోసం కాదు. సినిమా చూస్తున్నంత సేపు రామ్ పోతినేని నటన మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. ఈ సినిమా చూశాక నేను కూడా సినిమాకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ మహేష్ బాబు. ప్రస్తుతం డైరెక్టర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది హీరోల అభిమానులు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఉపేంద్ర మా హీరోల కంటే ఎందులో గొప్ప.. ఈ సినిమాకి ఆయన్ని మాత్రమే తీసుకోవడం ఏంటి..మిగతా హీరోలంతా ఆ పాత్ర పోషించలేరని మీ అభిప్రాయమా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: