ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం అనేది ఎక్కువగా ఉండేది.  భూస్వాములు, దొరలు, పెత్తందారులు భూములను ఆక్రమించి  పేద ప్రజలకు అన్యాయం చేస్తుంటే చూడలేక కొంతమంది వారిని ఎదిరించడం కోసం, నక్సలైట్లుగా మారి అడవుల్లో  ఉంటూ వీరందరికీ వ్యతిరేకంగా పోరాటం చేశారు. వందలాది ఎకరాల్లో జెండాలు పాతి పేదలకు భూములు పంచారు.. రాజకీయపరంగా కానీ ఎక్కడైనా సరే పేదలకు అన్యాయం జరిగితే ముందు నిలబడి  కొట్లాడిన వ్యక్తులే మావోయిస్టులు..అలాంటి మావోయిస్టులు తెలుగు రాష్ట్రాల నుంచి మొదలై దేశమంతా పాకారు. రకరకాల బెటాలియన్ల పేర్లతో  ఎన్నో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి నక్సలిజాన్ని ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అణచివేస్తోంది. ఆపరేషన్ "కగార్" పేరుతో  2026 మార్చి ఎండింగ్ కల్లా దేశంలో నక్సలిజం అనేది ఉండకూడదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. దీంతో నక్సలైట్లకు లొంగిపోయే ఛాన్స్ కూడా ఇచ్చారు. 

ఇందులో కొంతమంది లొంగిపోతే మరికొంతమంది దొరకకుండా తిరుగుతున్నారు. ఇదే తరుణంలో పోలీసు బలగాలు అడవులను జల్లెడ పట్టి  నక్సలైట్లను పూర్తిగా తుది ముట్టిస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నక్సల్స్ చేతుల్లో దుద్దిల్ల శ్రీపాదరావు నుంచి మొదలు కిడారి సర్వేశ్వరరావు వరకు ఎంతోమంది  నాయకులు హతమయ్యారు. వందలాది మంది పోలీసులు మరణించారు. అలాంటి ఈ తరుణంలో  మావోయిస్టులను పూర్తిగా అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. పూర్తిస్థాయి టెక్నాలజీ ఉపయోగించి అడవులను జల్లెడ పట్టింది. కనీసం వాళ్లు తలదాచుకోడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తోంది. దీంతో చాలామంది నక్సలైట్లు లొంగిపోయారు. మరి కొంతమంది పారిపోవడానికి ప్రయత్నాలు చేసి పోలీసులకు దొరికి మరణించారు. తాజాగా మావోయిస్టు అగ్ర నాయకుడు అయినటువంటి హిడ్మా కూడా మరణించడంతో నక్సలిజం ఇప్పటికి పూర్తయినట్టే తెలుస్తోంది.

కానీ మరో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. అయితే నక్సల్స్ సానుభూతిపరులేమో పోలీసుల వద్ద ఉన్నారని అంటున్నారు. మరి ఆయన దొరికాడా లేదంటే తప్పించుకు తిరుగుతున్నాడో తెలియదు. ఇక దేశవ్యాప్తంగా వేళ్ళ మీద లెక్కపెట్టే నక్సల్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. మార్చి 31 వరకు వీళ్లు కూడా తుది ముట్టే అవకాశం ఉంది. అయితే ఛత్తిస్ ఘడ్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుల పహారా ఉండడంతో వాళ్ళు తెలుగు రాష్ట్రమైనటువంటి విజయవాడ ప్రాంత అడవుల్లో ఉందామనుకున్నారు. చివరికి పోలీసులకు దొరికి చంపబడ్డారు. ఏ నేలపైనా అయితే నక్సలిజం మొదలైందో అదే నేలపై మావోయిస్టుల   క్లైమాక్స్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి నక్సలిజానికి అంతం ఉంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: