మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈమె రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ లో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈమెకు మంచి క్రేజ్ తెలుగు పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇలా వరుసగా నాలుగు సినిమాలతో ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో విజయాలను అందుకోవడంతో ఈమె  క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీగా పెరిగిపోయింది. అలా వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఈమె ఆ తర్వాత డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. డెవిల్ మూవీ తర్వాత ఈమె చాలా గ్యాప్ తీసుకుంది. దానితో అనేక మంది సంయుక్త మీనన్ "డెవిల్" మూవీ అపజయం చెందడంతో డిసప్పాయింట్ అయింది. ఈమె ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉంది. అందుకే చాలా టైం తీసుకుంటుంది అని అనుకున్నారు. ఈమె ప్రస్తుతం అఖండ 2 మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటి ద్వారా ఈ మూవీ పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతుంది. దానితో ఇంత కాలం కాటు సంయుక్త కమర్షియల్ సినిమా కోసమే ఎదురు చూసిందా ..? అందుకే ఇంత గ్యాప్ తీసుకుందా అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సంయుక్త మీనన్ ప్రస్తుతం అఖండ 2 మూవీ తో పాటు నిఖిల్ హీరో గా రూపొందుతున్న స్వయంభు అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: