నందమూరి నటసింహం  బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా భారీ అంచనాల చిత్రం “అఖండ 2 – తాండవం” ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే డబుల్  పవర్‌ప్యాక్ యాక్షన్. ఈ అఖండ 2 దేవాలయాల నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ సన్నివేశాలు అన్నది అందరికీ తెలిసిందే. ఈసారి ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.


సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకోగా, ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియా స్కేల్‌లో వేగంగా చేస్తున్నారు. కాగా తాజాగా చిత్రయూనిట్ దేశంలోని అత్యంత ప్రాధాన్యమైన నాయకుల్లో ఒకరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త, చిత్ర నిర్మాతలతో కూడిన అఖండ టీం లక్నోలో సీఎం యోగిని మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడుకున్నారు.



ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు యోగి ఆదిత్యనాథ్‌కు ‘అఖండ’ థీమ్‌ను ప్రతిబింబించే పవిత్ర త్రిశూలాన్ని బహూకరించారు. యోగి గారు కూడా టీంకు ఆశీస్సులు తెలియజేస్తూ సినిమా ఉత్తర భారత ప్రేక్షకులని ఆకట్టుకునేలా భారీ విజయాన్ని సాధించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అఖండ 2 పై ఉన్న నార్త్ ఇండియా ఇంట్రెస్ట్‌ను ఇంకా పెంచేశాయి. సినిమాకు థమన్ ఎస్ శక్తివంతమైన నేపథ్య సంగీతం, అలానే పౌరాణిక వైభవం కలగలిపిన ఆధ్యాత్మిక యాక్షన్ టచ్ పెద్ద అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ముఖ్యంగా అఖండ పాత్రలో బాలయ్య మరింత ఇంటెన్స్ లుక్‌తో కనిపించబోతున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.


అంతా పూర్తయిన నేపథ్యంలో, డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా రొరింగ్ గ్లాండ్స్, ఆగ్రెసివ్ ప్రమోషన్స్, భారీ స్కేల్ టెక్నికల్స్—అన్నీ ఈ “అఖండ 2 – తాండవం” కి ప్లస్ అవ్వబోతున్నాయి. ఈ ఏడాది చివర్లో పెద్ద సినిమాల జాబితాలో  ఇదే టాప్‌లో ఉండటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: