సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు బిగ్ హీరోలను ఒకే తెరపై చూడాలంటే అది చాలా అరుదైన విషయంగా పరిగణించేవారు. స్టార్‌డమ్, ఇమేజ్, ఫ్యాన్‌బేస్, స్క్రీన్‌ స్పేస్ బ్యాలెన్సింగ్ లాంటివి ఒకే ఫ్రేమ్‌లో రావడానికి పెద్ద అడ్డంకులుగా ఉండేవి. అయితే ఇవన్నీ  గతమే. ప్రస్తుత తరం దర్శకులు, కథలు, సినిమా మార్కెట్—మల్టీస్టారర్ ట్రెండ్‌ను ఎంతో ఈజీగా మార్చేశాయి. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఈ కాంబినేషన్స్‌నే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. అందుకే పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ కూడా ద్వంద్వ పాత్రలు, కాంబినేషన్ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాలంగా ఒక ప్రత్యేక కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తూనే ఉంది. అదే నాగార్జునఎన్టీఆర్ కాంబో. ఈ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఏళ్లతరబడి ఊహించుకుంటూ ఉండేవారు. నిజానికి ఈ కాంబినేషన్ ఒక్కసారి ఏర్పడబోయింది కూడా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఊపిరి’ సినిమాలో కార్తి చేసిన పాత్రను మొదట ఎన్టీఆర్ కోసం అనుకున్నారని అప్పట్లో పెద్దగా వార్తలు వచ్చాయి. కథ వినిపించగా పాత్రకు స్కోప్ ఉన్నప్పటికీ, ఆ పాత్రకు అవసరమైన శరీర భాష, హైట్ బ్యాలెన్సింగ్ కారణంగా… “ఎన్టీఆర్ ఇలా చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు” అనే ఆలోచనతో చివరకు చిత్రబృందం ఆ పాత్రని ఎన్టీఆర్‌ రిజెక్ట్ చేశారట. ఆ తరువాతే ఆ రోల్ కార్తికి వెళ్లింది. ఇలా ఒకప్పుడు సెట్ అవబోయిన నాగార్జున–ఎన్టీఆర్ కాంబినేషన్‌ అకస్మాత్తుగా మిస్ అయ్యింది.



కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్‌ను ఇప్పటికీ మరచిపోలేదు. ఏదో ఒకరోజు ఈ ఇద్దరూ కలిసి నటిస్తారనే ఆశ మాత్రం తగ్గలేదు. కాగా… ఇన్నేళ్ల తరువాత ఆ కల నెరవేరబోతుందనే పెద్ద వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ “మురుగన్” (వర్కింగ్ టైటిల్) లో కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారని, ఆయనను తీసుకునేందుకు టీమ్ చాలా ఆసక్తిగా ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్‌గా ఉండబోతుందని, ఎన్టీఆర్‌తో పాటు నాగార్జున ఉండడం వల్ల సినిమాకు మరింత క్రేజ్, విస్తృత మార్కెట్ లభిస్తుందని భావిస్తున్నారట. వీళ్లిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకీ అదనపు హైలైట్ అవుతుందని కూడా అనుకుంటున్నారు.



ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో, ఫ్యాన్స్ మధ్య… ఈ న్యూస్ అట్టుడికిపోయినట్లయ్యింది. ఎందుకంటే ఇన్నాళ్లు కుదరని ఈ కాంబో ఇప్పుడు నిజంగా ఫైనల్ అయినట్టే అన్న ఆశతో అందరూ ఈ అప్‌డేట్‌ను వైరల్ చేస్తున్నారు.ఇక త్రివిక్రమ్ స్టైల్, ఎన్టీఆర్ ఎనర్జీ, నాగార్జున క్లాస్ ప్రెజెన్స్—అన్ని ఇది టాలీవుడ్‌లోనే కాదు పాన్‌ఇండియా స్థాయిలో కూడా పెద్ద ప్రాజెక్ట్‌గా తయారయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. మొత్తానికి, ఒకప్పుడు మిస్ అయిన నాగార్జున–ఎన్టీఆర్ సినిమా కాంబినేషన్… ఇప్పుడు  యాక్షన్‌లోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే టాలీవుడ్‌లో  సంవత్సరాల కల నెరవేరిన క్షణంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: