ఇండస్ట్రీలో ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు తమకంటూ ప్రత్యేకమైన రాజ్యమేలుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా పెద్ద లిస్ట్ ఉంది. అంతేకాదు, నిర్మాతలుగా కూడా నిహారిక కొణిదల, సుస్మిత కొణిదల వంటి సభ్యులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి డైరెక్టర్ కూడా రాబోతున్నారన్న వార్త బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, ఫ్యాన్స్ ఆనందంతో షర్ట్ విప్పేసి ఎగరేస్తున్నారు.అవునూ… ఆ కొత్త డైరెక్టర్ మరెవరో కాదు — నిహారిక కొణిదల అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


నిహారిక తన కెరీర్‌ను యాంకర్‌గా ప్రారంభించింది. తర్వాత వెబ్ సిరీస్‌ తో నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం నిర్మాతగా తన స్థానం స్థిరపరుచుకుంది. ప్రొడక్షన్‌లో సక్సెస్ ఇవ్వడమే కాకుండా, కంటెంట్ సెలక్షన్‌లో కూడా మంచి సెన్స్ ఉందని నిరూపించింది.ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కొత్తగా డైరెక్షన్ వైపు అడుగులు వేస్తోందట.మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న అంతర్గత సమాచారం ప్రకారం —నిహారిక ఇప్పటికే ఒక బలమైన కథను రెడీ చేసింది. అదే కథను తానే డైరెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యిందట. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా ముగిసిందని, ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నిహారిక స్టార్ హీరోలను కాకుండా పూర్తిగా కొత్త నటీనటులనే తీసుకోవాలనుకుంటుందట. కథ కూడా చాలా రియలిస్టిక్‌గా, ప్రస్తుతం జరుగుతున్న సామాజిక పరిస్థితులకు దగ్గరగా ఉండేలా రూపుదిద్దుకుంటుందని సమాచారం.



ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే — నిహారిక వ్యక్తిగతంగా చూసిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రాసిందట. అందుకే కథలోని భావోద్వేగాలు, పాత్రలు చాలా నేచురల్‌గా ఉంటాయని టాక్. డివోర్స్ తర్వాత నిహారిక పూర్తిగా సెల్ఫ్-ఫోకస్ అవుతూ, కెరీర్‌ మీద మరింత దృష్టి పెట్టింది. వ్యక్తిగతంగా, మెంటల్లీ, ప్రొఫెషనల్‌గా ఎంతో ఎదిగిందని ఆమెను దగ్గరగా చూసేవాళ్లు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: