సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్ ఎప్పటికప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి టాప్ మోస్ట్ కాంబినేషన్లలో చాలా మంది ఇప్పటికీ మిస్ అవుతున్న జోడి — నయనతార & మహేష్ బాబు. అందాల ముద్దుగుమ్మ నయనతార, హ్యాండ్సమ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒకే సినిమాలో నటించి ఉంటే, ఆ కాంబో స్క్రీన్‌పై కనిపించడం ఫ్యాన్స్‌కు నిజంగా ఒక భారీ విజువల్ ట్రీట్ అయ్యేది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తరచూ ఒకే ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. “మహేష్–నయనతార కాంబినేషన్‌లో ఎందుకు ఒక్క సినిమా కూడా రాలేదు?”..ఈ ప్రశ్నకు సంబంధించిన చర్చలు ఎప్పటికీ ఆగవు. ఎందుకంటే గతంలో చాలామంది ప్రముఖ దర్శకులు ఈ కాంబో కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్‌లు రెడీ చేసి, ఇద్దరినీ క్యాస్ట్ చేయడానికి ప్రయత్నించారట. కానీ ప్రతిసారీ కూడా విషయం చివరికి విఫలమయ్యిందని ఇండస్ట్రీ టాక్.


అసలేంటంటే—నయనతార తన సినిమాల విషయంలో కొన్ని స్ట్రిక్ట్ కండిషన్లు పెట్టడం కారణంగా, మహేష్ బాబుతో చేయాల్సిన ప్రాజెక్టులు పూర్తికాలేదని టాక్ వినిపించింది. ఆమె పెట్టే కండిషన్లు ఇలా ఉన్నాయట. సినిమా ప్రమోషన్స్‌కు హాజరు కావడం కష్టంగా ఉంటుంది. షూటింగ్ ఈ ప్రాంతంలో జరగకూడదు, ఆ లొకేషన్‌లో చేయకూడదు వంటి లొకేషన్ పరిమితులు..కథలో తన క్యారెక్టర్‌కు స్పెషల్ ప్రాముఖ్యత ఉండాలి..షూటింగ్ డేస్, షెడ్యూల్‌లపై స్పష్టమైన రూల్స్.ఈ కండిషన్లు మహేష్ బాబుకు సెట్ కాలేదట. ఆయన సాధారణంగా సహ నటీనటులపై ఎక్కువ డిమాండ్లు పెట్టే ఆర్టిస్ట్‌లను ఇష్టపడరని కూడా కొందరు చెబుతారు. అందుకే నయనతారను ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడుసార్లు మహేష్ బాబు సినిమాల నుంచి తప్పించాల్సి వచ్చిందట అని ఇండస్ట్రీలో అనేవారు.



ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే—నయనతార కోసం మొదటగా రాసుకున్న ప్రతి సినిమాలో, ఆమె స్థానంలో చివరికి వేరే హీరోయిన్ ఎంపికయ్యారు. ఆశ్చర్యకరంగా, ఆ సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఈ విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులు ప్రస్తావిస్తూ,“అయ్యో! మహేష్–నయన కాంబో వచ్చినా ఎంత బాగుండేదో!” అంటూ బాధపడుతూనే ఉంటారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ ఇలా కూడా అంటారు..“ఒక్క సినిమైనా వచ్చి ఉండి ఉంటే, ఇది టాలీవుడ్‌లో ఒక గోల్డెన్ కాంబినేషన్‌గా లెక్కించబడేది.” ఇప్పటికీ ఇరువురి క్రేజ్ తగ్గలేదు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ కాంబినేషన్ జరీగితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనే మాట నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: