కోలీవుడ్ నటుడు సూర్య ప్రస్తుతం కరుప్పు అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే దానిపై ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సూర్య కు తమిళ్ ఇండస్ట్రీ తర్వాత ఆ స్థాయి మార్కెట్ తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశారు. అందులో చాలా మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇది సూర్య కు మొట్ట మొదటి తెలుగు సినిమా. ఈ సినిమా గనుక మంచి విజయం సాధించినట్లయితే సూర్య క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గత కొంత కాలంగా సూర్య చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అందులో చాలా సినిమాలతో సూర్య కు అపజయాలు దక్కాయి. ఈయన మంచి విజయాన్ని అందుకొని చాలా కాలమే అవుతుంది. ఇకపోతే మరి కొంత కాలం లోనే విడుదల కానున్న కరుప్పు సినిమాతో సూర్య మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి సూర్య "కరుప్పు" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం కరుప్పు మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: