ఈ వారం తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అయ్యాయి. ఈ వారం రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన పాంచ్ మినార్ , ప్రియదర్శి హీరోగా నందిని హీరోయిన్గా రూపొందిన ప్రేమంటే , అల్లరి నరేష్ హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా రూపొందిన 12 A రైల్వే కాలనీ , అలాగే అంతా కొత్త వాళ్ళతో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఈ నాలుగు సినిమాలలో మొదటి నుండి రాజు వెడ్స్ రాంబాయి సినిమా పై తప్ప వేరే సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. విడుదలకు కాస్త ముందు నరేష్ హీరోగా రూపొందిన 12 A రైల్వే కాలనీ సినిమాపై కాస్త మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రియదర్శి హీరోగా నటించిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈయన నటించిన ప్రేమంటే సినిమాపై కూడా ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో నటించిన ఏ సినిమా కనీస విజయాన్ని అందుకోకపోవడం వల్ల ఆయన నటించిన పాంచ్ మినార్ మూవీ పై ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు.

ఇలా ఈ వారం నాలుగు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న రాజు వెడ్స్ రాంబాయి మూవీ కి కాస్త మంచి టాక్ వచ్చింది. దానితో ప్రేక్షకులకు వేరే ఆప్షన్ కూడా లేకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ కేవలం మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ వారం నాలుగు సినిమాలు విడుదల అయినా కూడా రాజు వెడ్స్ రాంబాయి ఇప్పటికే మంచి కలెక్షన్లను వసూలు చేసి హిట్టు స్టేటస్ను అందుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: