టాలీవుడ్ ఇండస్ట్రీలో 'ప్రేమ ఇష్క్ కాదల్', 'వైశాఖం' సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకున్న హరీష్ ధనుంజయ్ "మరువ తరమా" సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గురువారం రోజున మరువ తరమా మూవీ ప్రీమియర్స్ ప్రదర్శితం కాగా అవంతిక, అతుల్య చంద్ర ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. rx100 పాటల రచయిత చైతన్య వర్మ నడింపల్లి డైరెక్షన్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
రిషి (హరీష్ ధనుంజయ్) తను వర్క్ చేసే ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్న సింధును (అవంతిక) ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. తొలి చూపులోనే ప్రేమలో పడిన రిషి కొన్ని కారణాల వల్ల ఆమె నుంచి విడిపోతాడు. అదే ఆఫీస్ లో వర్క్ చేసే అన్వీ (అతుల్య చంద్ర) కూడా రిషిని ప్రేమిస్తున్నా రిషి సింధు ప్రేమలో ఉన్నాడని తెలిసి తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే విషయంలో వెనుకడుగు వేస్తుంది. రిషి జీవితంలోని సింధు మళ్ళీ వచ్చిందా? అన్వీ తన ప్రేమను రిషికి చెప్పిందా? రిషి తల్లి(రోహిణి) కొడుకుకు చెప్పిన జీవిత సత్యం ఏమిటి? ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీలో చోటు చేసుకున్న ట్విస్టులేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
మరువ తరమా స్టోరీ లైన్ మరీ కొత్త స్టోరీ లైన్ కాదు. అయితే కథనంతో దర్శకుడు చైతన్య వర్మ మ్యాజిక్ చేశాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు రూపొందించాడు. రియలిస్టిక్ టచ్ తో, సహజంగా తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
పంచ్ లతో ఉన్న డైలాగ్స్ సినిమాకు మేజర్ అస్సెట్ అని చెప్పవచ్చు. ఆఫీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ప్రతి సీన్ హిలేరియస్ గా ఉంది. పాటలు, బీజీఎం సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమాలోని ఏదో ఒక పాత్రలో తమను తాము చూసుకుంటారు.
హరీష్ ధనుంజయ్ లుక్స్ తో, యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ తో మెప్పించడంతో పాటు అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు. సింధు పాత్రలో అవంతిక, అన్వీ పాత్రలో అతుల్య చంద్ర మెప్పించారు. రోహిణి తెరపై కనిపించింది కొంత సమయమే అయినా ఆమె తన నటనతో మెప్పించారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే విజయ్ బుల్గానిన్, హరీష్ మ్యూజిక్, బీజీఎం సినిమా స్థాయిని పెంచాయి. కొన్ని సన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల తెరపై మరింత అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చైతన్య వర్మ మంచి సబ్జెక్ట్ ను ఎంచుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించే విషయంలో సక్సెస్ అయ్యారు.
ఈ వీకెండ్ కు మంచి సినిమా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో చూడాలని భావించే వాళ్లకు మరువ తరమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లవ్ స్టోరీస్ ను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
రేటింగ్ : 2.75/5.0
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి