తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైతం రవిని చంచల్ గూడా జైలు నుంచి నిన్నటి రోజున బహిర్భాగాలోని సిసిఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి మరి అక్కడ విచారణ చేపట్టగా రవి క్లౌడ్ సర్వర్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. ముఖ్యంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ తో క్లౌడ్ సర్వర్ ని తెరిచి చూసిన వెంటనే అధికారులకు ఒక పెద్ద షాక్ తగిలింది. అదేమిటంటే అందులో సుమారుగా 21 వేల సినిమాలు భద్రపరిచినట్లుగా బయటపడింది. అలాగే రవి మెయిల్ పరిశీలించగా డొమైన్ కొనుగోలు చేసిన బిల్లులు కూడా అందులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే పైరసీ వెబ్సైట్ కోసం డేటా నిర్వహణ అందుకు అనుసరించేన విధానాల మీద లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం.
మరో రెండు రోజులపాటు ఇంకా విచారణ చేయవలసి ఉందంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఐ బొమ్మ రవిని అరెస్టు చేయడం పైన పలువురు సినీ ప్రముఖులు ఆనందాన్ని తెలియజేస్తూ పోలీసులను ప్రశంసించారు.. కానీ ఇదే సమయంలోనే బయట సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవికి చాలా సపోర్టివ్ గానే నిలుస్తూ ఉండడమే కాకుండా రవి కారణంగానే తాము ఇంట్లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నామని అతను రియల్ హీరో, రాబిన్ ఫుడ్ అంటూ బిరుదులతో వైరల్ గా చేస్తున్నారు. ఇటీవలే ఐ బొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా కూడా రాబోతున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి