కన్నడ నాట సంచలనం సృష్టించిన 'కాంతార', దాని తదుపరి భాగం 'కాంతార చాప్టర్ 1' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కేవలం వసూళ్ల పరంగానే కాకుండా, ముఖ్యంగా తుళునాడు సంస్కృతికి అద్దం పట్టే పంజుర్లీ, గుళిక దేవతలకు సంబంధించిన అద్భుతమైన సన్నివేశాల చిత్రీకరణతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
అయితే, ఇటీవల బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్ ఈ చిత్రంలోని కీలకమైన దైవసన్నివేశాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. హీరో పాత్రలోకి దైవం లేదా శక్తి ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశాల చిత్రీకరణ బాగుందని ప్రశంసిస్తూనే, ఆయన ఆ సన్నివేశాల్లోని 'ఓ' అనే శబ్దాన్ని అనుకరిస్తూ దానిని హాస్యాస్పదంగా ప్రస్తావించడం కన్నడిగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
'కాంతార' చిత్రం కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదని, కన్నడ మరియు తుళునాడు ప్రాంత ప్రజల విశ్వాసం, సంస్కృతి, నమ్మకాలకు సంబంధించిన అంశమని, ఈ దైవ నృత్యాలను, శబ్దాలను అగౌరవపరిచేలా మాట్లాడటం సరికాదని కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. దైవసమానంగా భావించే ఆచారాలను, నృత్యాలను అగౌరవపరిచినందుకు రణ్‌వీర్ సింగ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కన్నడ ప్రజలు, పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం బాలీవుడ్-సౌత్ చిత్ర పరిశ్రమల మధ్య మరో చర్చకు తెరలేపింది. ఈ కామెంట్లపై రిషబ్ శెట్టి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి