రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా 2026 సంవత్సరం మార్చి నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం. ఇది మెగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నా పెద్ది సినిమా మాత్రం వాయిదా పడే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.

గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం షూటింగ్ జనవరి చివరి వారం నాటికి పూర్తి కానుందని సమాచారం. అంతేకాకుండా, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, మేకర్స్ ప్రకటించిన తేదీకే సినిమా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు గత చిత్రం 'ఉప్పెన' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి వస్తున్న 'పెద్ది' కూడా అదే స్థాయిలో లేదా అంతకుమించి విజయాన్ని నమోదు చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మెగా ఫ్యాన్స్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని, మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ మరింత ముందుకు తీసుకువెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు. రామ్ చరణ్సినిమా కోసం మేకోవర్ అయిన తీరు, ప్రచార చిత్రాలు చూస్తుంటే, సినిమా కచ్చితంగా గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ కనిపిస్తోంది. 'పెద్ది' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే 2026 మార్చి 27 వరకు వేచి చూడాల్సిందే.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: