ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపించరు.  ఈ ఏడాది నవంబర్ నెల మాత్రం బాక్సాఫీస్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను అందించింది.  నవంబర్ నెల బాక్సాఫీస్ మాస్ జాతర సినిమాతో మొదలైంది.  మాస్ జాతర సినిమా ప్రీమియర్స్  కు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా  ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.  

రష్మిక నటించిన ది  గర్ల్ ఫ్రెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.  జటాధర మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.  తిరువీర్ నటించిన ది  గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.  నవంబర్ సెకండ్ వీక్ లో  కాంత, జిగ్రీస్,  గత వైభవం, సంతాన  ప్రాప్తిరస్తు సినిమాలు విడుదల కాగా  ఈ సినిమాలన్ని  ఒక సినిమాను మించి మరొకటి ప్లాప్ గా నిలవడం గమనార్హం.

అదే వారం థియేటర్లలో విడుదలైన శివ రీరిలీజ్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ మూడో వారంలో 12ఏ రైల్వే కాలనీ, ప్రేమంటే సినిమాలు విడుదలై ప్లాప్ కాగా రాజు వెడ్స్ రాంబాయి మాత్రం  బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.  కొదమ సింహం, ఆవారా సినిమాలు రీరిలీజ్ కాగా ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

నవంబర్ చివరి వారంలో ఆంధ్ర  కింగ్ తాలూకా,  రివాల్వర్ రీటా సినిమాలు రిలీజ్ కాగా  ఆంధ్ర  కింగ్ తాలూకా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.   రివాల్వర్ రీటా మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: