ఏ ఇండస్ట్రీలోనైనా సరే క్రేజ్ ఉన్నప్పుడే భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు. కానీ అవకాశాలు తగ్గినప్పుడు లేదా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు మాత్రం రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్న సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన పూజా హెగ్డే కూడా చేరింది. టాలీవుడ్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అలా వైకుంఠపురంలో సినిమాతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా రూ. 1.5 నుంచి రూ .3కోట్ల వరకు డిమాండ్ చేసిందని టాక్ ఉంది.


అంతటి రెమ్యూనరేషన్ ఇవ్వలేక చాలామంది ఈమెకు అవకాశాలు ఇవ్వలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది పూజ హెగ్డే.  ఈ సినిమా కోసం ఏకంగా తన రెమ్యూనరేషన్ రూ.3 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తాజాగా ఒక వార్త వినిపిస్తోంది. రెట్రో చిత్రానికి  రూ.4 కోట్ల రూపాయలు తీసుకున్న పూజా హెగ్డే జననాయగన్ సినిమా కోసం 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం  రూ.3 కోట్లు తీసుకున్న పూజ హెగ్డే...ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమా కోసం కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.



ప్రస్తుతం పూజ హెగ్డే కెరియర్ లో బ్లాక్ బాస్టర్ హిట్  విని చాలా కాలమవుతోందని , అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేదని క్రిటిక్స్ సైతం తెలియజేస్తున్నారు. అయితే పూజ హెగ్డే కెరియర్ లో సినిమాలు ఫెయిల్యూర్ అయినప్పటికీ ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి.. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. మరి ఇందులో ఏ ఒక్క సినిమా సక్సెస్ అయినా పూజా హెగ్డే కెరియర్ మారిపోతుంది. మొత్తానికి పూజ హెగ్డే వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న విషయాన్ని గ్రహించి రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరీ సినిమాలలో నటిస్తుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: