బాలకృష్ణ నటించిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న అఖండ 2 సినిమాపై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది థియేటర్లలో విడుదలవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా, అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్‌లు రేపటి నుంచి మొదలయ్యే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ బుకింగ్స్‌లో సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
అంతేకాకుండా, డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. ఈ ప్రీమియర్స్ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి ఆటకే సినిమా టాక్ ఎలా ఉండబోతోంది, బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రీమియర్స్ ప్రదర్శన తర్వాత కలెక్షన్ల వేట మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
మొదటి భాగం 'అఖండ' సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, అఖండ 2 కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను నెలకొల్పడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అఖండ2 మూవీ 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అఖండ2 పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి