మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక టాలీవుడ్ నటుడు జగపతి బాబు , బాలీవుడ్ నటుడు దివ్యందు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి చిక్రీ చిక్రీ అంటూ సాగే మొదటి సాంగ్ ను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ డిసెంబర్ 5 వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఓ చిన్న షెడ్యూల్ను నిర్వహించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ షెడ్యూల్ ముగిసిన తర్వాత పెద్ద యూనిట్ 20 రోజుల పాటు హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ను పూర్తి చేయనున్నట్లు , దానితో ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షెడ్యూల్ కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: