వివాహానంతరం సమంత స్వయంగా తమ పెళ్లి చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో, అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. సోషల్ మీడియాలో క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.వీరి వివాహం జరిగిన విధానం మీద నెట్‌లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈశా ఫౌండేషన్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సమంత–రాజ్ నిడమోరు “భూత శుద్ధి వివాహం” అనే ప్రత్యేక యోగసంప్రదాయ విధానంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.ఇది ఏమిటి? ఎందుకు ప్రత్యేకం? అనేది అందరిలో సందేహంగా మారింది.
ఈశా ఫౌండేషన్ వివరణ ప్రకారం — భూత శుద్ధి వివాహం అనేది వేలాది ఏళ్లుగా యోగ సంప్రదాయంలో కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి. పేరుకు తగ్గట్లుగానే, ఇది మనుషుల దేహంలో ఉన్న పంచభూతాలను శుద్ధి చేయడం, వాటిని సమతుల్యంలో ఉంచడం, దంపతుల మధ్య ఆలోచనలకు, భావోద్వేగాలకు, భౌతికతకు అతీతంగా ఒక లోతైన బంధాన్ని ఏర్పరిచే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ వివాహం సాధారణ హిందూ జంటలకు చేసే సంప్రదాయ మంత్రోచ్చరణలతో పాటు, వధూవరుల శరీర, మనసు, జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసే యోగిక క్రతువులతో జరుపుతారు. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ విధానం, దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా, శ్రేయస్సుతో నిండుకుండేలా ఆశీర్వదించబడిందని చెబుతారు.
ఈశా ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటనలో, ఈ దంపతుల జీవితంలో ఆధ్యాత్మికత వికసించేందుకు, పరస్పర అనురాగం మరింత బలపడేందుకు, భవిష్యత్తులో వారి ప్రయాణం శాంతి–సౌఖ్యాలతో నిండిపోవడానికి సహాయపడుతుందని స్పష్టంగా పేర్కొంది.సమంత కొత్త జీవితం వైపు అడుగుపెట్టిన ఈ సందర్భంలో, అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజనులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి