తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘లేడీ సూపర్ స్టార్’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది మన సమంత రుత్ ప్రభు. కొన్ని గంటల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె చిన్ననాటి ఫోటో.. టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలో మార్షల్ ఆర్ట్స్ డ్రెస్సులో ఉన్న ఆ చిన్నారిని చూసి, ఆమె ఈ రోజు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరని ఎవరూ ఊహించలేరు. అందుకే, ఆమె కేవలం అందాల అప్సరస మాత్రమే కాదు, జీవితంలో ఎదురైన ప్రతీ పోరాటాన్ని సింహంలా ఎదుర్కొన్న ఒక రియల్ ఫైటర్!బాల్యంలోనే కరాటే నేర్చుకున్న సమంతలో, ఆ ఫైటర్ స్పిరిట్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.‘ఏ మాయ చేసావె’తో అందమైన గీతలా మొదలైన ఆమె సినీ ప్రయాణం.. ‘రంగస్థలం’, ‘మహానటి’లో ఆమె నటనకు అందిన ప్రశంసలు, ‘ఈగ’తో వచ్చిన పాన్-ఇండియా గుర్తింపు... ఆమెను కేవలం హీరోయిన్‌గా కాక, ‘తోపు నటి’గా నిలబెట్టాయి. ఒక మాస్ హీరోకు సరిపడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని, తెలుగు, తమిళ పరిశ్రమలను ఒకేసారి ఏలేసిన ఏకైక నటి ఆమె.



పెళ్లి, విడాకులు వంటి వ్యక్తిగత కల్లోలాలను ధైర్యంగా దాటిన తర్వాత, ఆమెను మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి కుదిపేసింది. ఈ దశలో సినీ కెరీర్‌ను వదిలేస్తుందన్న ప్రచారం జరిగినా, ఆమె తగ్గేదే లేదంటూ బరిలోకి దిగింది. 'యశోద' సినిమాలోని ఆమె యాక్షన్, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌లో చూపించిన గ్రిప్పింగ్ పర్ఫార్మెన్స్.. తనలోని 'కరాటే కిడ్' స్పిరిట్ ఇంకా సజీవంగా ఉందని చెప్పకనే చెప్పాయి.ఇప్పుడు, బాలీవుడ్ స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు, అంతర్జాతీయ సిరీస్‌లు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆమె ‘పాన్ ఇండియా క్వీన్’గా తన సింహాసనాన్ని నిలబెట్టుకుంది. చిన్ననాటి కరాటే ఫోటోలో ఉన్న తెగువే ఈ రోజు ఆమెను ఒక టాలీవుడ్ ఐకాన్‌గా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు! ఆమె విజయం.. తెలుగు ఆడియన్స్‌కు ఒక మాస్ ఎలివేషన్!


https://www.instagram.com/p/DRtrePWET2L/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




మరింత సమాచారం తెలుసుకోండి: