ప్రముఖుల మరణాలను చాలామంది సరదాగా మీమ్స్ గా మార్చేస్తున్నారంటూ అసహనాన్ని తెలియజేసింది. తాను తన తల్లి గురించి మాట్లాడితే తల్లి మరణాన్ని వాడుకొని వార్తలలో నిలుస్తోంది అంటూ ఎక్కడ రాస్తారో అని భయపడి నాలో నేనే ఎన్నోసార్లు కుమిలిపోయానని , ఆ బాధను ,ఆవేదనను తాను మాటలలో చెప్పలేనని తెలియజేసింది జాన్వీ కపూర్. మీడియా, సోషల్ మీడియా, జర్నలిజం మానవ నైతికను చాలా దెబ్బతీస్తున్నాయని తెలిపింది. ఇటీవల నటుడు ధర్మేంద్ర మరణించినప్పుడు కూడా మీమ్స్ రాశారు. ఒక మరణాన్ని మీమ్స్ గా మార్చడం చాలా పాపం రోజు రోజుకి ఈ పరిస్థితి చాలా దిగజారి పోతుందంటూ ఎమోషనల్ గా తెలియజేసింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో(అచ్చియ్యమ్మ) గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.పెద్ది సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్ కూడా భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సాంగ్లో జాన్వీ కుర్రకారులను తన అందంతో ఆకట్టుకుంది. ఇప్పటికే వంద మిలియన్స్ పైగా ఈ పాట వ్యూస్ సాధించినట్లు తెలస్తోంది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి