తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే వెంకటేష్ కెరియర్లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ప్రేమంటే ఇదేరా మూవీ ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా ప్రీతి జింటా నటించగా ... జయంత్ పరార్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీహరిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లోని వెంకటేష్ , ప్రీతి జింటా నటనలకు ఆ సమయం లో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 1998 వ సంవత్సరం విడుదల అయ్యి ఆ సమయం లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. 

ప్రేమంటే ఇదేరా మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడింది. తాజాగా ప్రేమంటే ఇదేరా మూవీ బృందం వారు వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13 వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలో రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడ్డాయి. మరి ప్రేమంటే ఇదేరా సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో , ఏ రేంజ్ ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: