సినిమా ఇండస్ట్రీ లో కొన్ని రికార్డులను చాలా తక్కువ కాలం లోనే బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇక మరి కొన్ని రికార్డులు మాత్రం చాలా సంవత్సరాలు అలా పదిలంగా ఉండిపోతూ వస్తాయి. 13 సంవత్సరాల అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ రికార్డును ఏ హీరో టచ్ చేయలేకపోతున్నాడు. ఇంతకు ఆ రికార్డు ఏమిటి అని అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... దాదాపు 13 సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఢమరుకం సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నవంబర్ నెలలో విడుదల అయింది. ఈ మూవీ ఆ సమయంలో దాదాపు 26 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత నవంబర్ నెలలో విడుదల అయిన ఏ సినిమా కూడా డమరుకం స్థాయి షేర్ కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. ఇక తాజాగా రామ్ పోతినేని "ఆంధ్ర కింగ్ తాలూకా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 27 వ తేదీన విడుదల చేశారు.

మూవీ ని నవంబర్ నెలలో విడుదల చేయమన్నారు అనే ప్రకటన రాడవడం తోనే ఈ సినిమాకు గనుక మంచి టాక్ వస్తే ఢమరుకం మూవీ కలెక్షన్ల కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి కొత్త రికార్డును ఈ మూవీ నెలకొల్పుతుంది అని చాలా మంది భావించారు. ఇక ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. దానితో ఈజీగా ఢమరుకం మూవీ కలెక్షన్లను ఈ సినిమా దాటేసి కొత్త రికార్డును సృష్టిస్తుంది అని అనేక మంది అనుకున్నారు. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. దానితో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా డమరుకం మూవీ షేర్ కలెక్షన్లను మించి వసూళ్లను రాబట్టడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే లోపు ఢమరుకం మూవీ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేస్తుందో ..? లేదో ..? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: