టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాలు క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా బాలకృష్ణ హీరో గా సంయుక్త మీనన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను "అఖండ" మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాను రూపొందించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ సినిమాను రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందడం ,  ప్రస్తుతం బాలయ్య వరుస పెట్టి విజయాలను అందుకొని ఫుల్ ఫామ్ లో ఉండడంతో అఖండ 2 మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. నిన్నటి వరకు ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 100 కే ప్లస్ ఇంట్రెస్ట్ లు ఉన్నాయి. ఇక ఒక్క రోజు లోనే ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 50 కే ఇంట్రెస్ట్ లు పెరిగి 150 కే ప్లస్ కి చేరుకున్నాయి. దాని తోనే అర్థం అవుతుంది ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను  , తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి  , ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: