విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లికి సంబంధించి  ఏ వార్త అయినా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.  ఫిబ్రవరిలో విజయ్  రష్మికల పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం గురించి రష్మిక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.  తాను  పెళ్లి వార్తలను ఇప్పుడే ధృవీకరించలేనని  అలాగని వీటిని ఇప్పుడు ఖండించలేనని తెలిపారు.  పెళ్లి గురించి  ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతానని ఆమె అన్నారు.

కచ్చితంగా  మీ అందరితో పంచుకుంటానని   అంతకు మించిన వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని రష్మిక తెలిపారు.  నేను వ్యక్తిగత జీవితం గురించి బయటకు వెల్లడించడానికి ఇష్టపడనని  పర్సనల్ లైఫ్ ను చాలా సీరియస్ గా తీసుకున్నానని ఆమె వెల్లడించారు.  ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ గురించి మాట్లాడనని ప్రతి పనికి  ప్లాన్స్  వేసుకుంటానని  సినిమాల విషయానికి వస్తే ఒక్కోసారి అనుకున్నట్టు జరగదని ఆమె పేర్కొన్నారు.

కొన్ని కారణాల వల్ల షూటింగ్స్ వాయిదా పడతాయని  మీటింగ్స్, రిహార్సల్స్ వల్ల షూటింగ్స్ ఆలస్యం అవుతాయని రష్మిక చెప్పుకొచ్చారు.  నేను డబుల్ షిఫ్ట్ లు చేసిన రోజులు ఉన్నాయని  నటీనటులు ఎప్పుడూ  పనిలో నిమగ్నమై ఉండాలని  నరుటో కార్టూన్ అంటే ఇష్టమని  దాని చూస్తూ విశ్రాంతి పొందుతానని ఆమె అన్నారు.

ఈ ఏడాది నాకు ఎంతో  స్పెషల్ అని విడుదలైన అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయని  ఇండస్ట్రీలో ఈ స్థానానికి రావాలంటే ఎంతో  కష్టపడాలని సక్సెస్ ఒక్కసారిగా రాదని ఆమె కామెంట్లు చేశారు. నేను ఎలాంటి కథల్లో అయినా నటించగలనని  ప్రేక్షకులకు తెలియడానికి కొంత  సమయం పడుతుందని ఆమె వెల్లడించారు.  భాష, జానర్ హద్దులు లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని  రష్మిక పేర్కొన్నారు.  ప్రస్తుతం రష్మిక పారితోషికం 5 నుంచి 6 కోట్ల రూపాయల స్థాయిలో ఉందని  సమాచారం అందుతోంది.  హీరోయిన్ రష్మికను  అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: