టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఆది సాయి కుమార్ ఒకరు. సాయి కుమార్ నట వారసుడిగా ఆది సాయి కుమార్ చాలా సంవత్సరాల క్రితమే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన ప్రేమ కావాలి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన లవ్ లీ అనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అలా కెరియర్ ప్రారంభించిన మొదట్లోనే రెండు విజయాలు అందుకొని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈయనకు ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ ఈయన లవ్ లీ మూవీ తర్వాత నటించిన ఏ సినిమా కూడా మంచి విజయం సాధించలేదు.

ఇకపోతే వరుస పెట్టి అనేక ప్లాప్స్ తర్వాత ఆది సాయి కుమార్ ప్రస్తుతం శంబాల అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీపై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ని డిసెంబర్ 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు నాన్ థియేటర్ హక్కుల ద్వారానే అదిరిపోయే రేంజ్ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఎకంగా 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వరుస ప్లాప్స్ లలో ఉన్న ఓ చిన్న హీరో మూవీ కి ఈ రేంజ్ నాన్ థియేటర్ బిజినెస్ జరగడం అనేది ఓ గొప్ప రికార్డు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: