కేవలం ఈ సినిమా రూ .60 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ విషయంపై హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మాట్లాడుతూ.. పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ విషయం వల్ల మా కుటుంబం చాలా ఆర్థికంగా నష్టం పోయిందని, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి నిర్మాతకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడితేనే ఇండస్ట్రీలో ఉండగలం ,కచ్చితంగా మేము తప్పకుండా మళ్ళీ పుంజుకుంటామంటూ తెలియజేసింది.
ఈ ఆర్థిక నష్టం వలన తమ నిర్మాణ సంస్థ పూజ ఎంటర్టైన్మెంట్స్ మూతపడిందని వదంతులు వినిపించాయి. అవన్నీ వాస్తవం కాదని.. ఎప్పటికీ కంపెనీ సేవలు కొనసాగుతూనే ఉంటాయని క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీతిసింగ్. ఇలాంటి ఇబ్బందులు మాకు ఒకటే కాదు ఒకానొక సమయంలో అమితాబచ్చన్ వంటి వారికి కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపింది. గతంలో కూడా రకుల్ ప్రీతిసింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా స్వయంగా ఈ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పెట్టుబడి కోసం తమ కుటుంబ ఆస్తులను తాకట్టు పెట్టామని అలా తాకట్టు పెట్టి సినిమా తీసిన కేవలం 50% కంటే తక్కువే తిరిగి వచ్చిందంటూ తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి