అయితే ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతం బుకింగ్స్ ను నిర్మాతలు సైతం నిన్నటి రోజున సాయంత్రం 6 గంటలకు నైజాం ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ చేస్తామంటూ ప్రకటించారు.అయితే ఆలస్యం కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోందనే విధంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రానికి ఇలాగే అనుమతులు ఇచ్చారు. కానీ కొంతమంది కోర్టులో కేసులు వేయడంతో నిర్మాతలకు వ్యతిరేకంగా కూడా తీర్పులు రావడంతో చాలా గందరగోళం ఏర్పడింది.
ఇప్పుడు బాలయ్య నటించిన అఖండ 2 చిత్రానికి అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది.. దీంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 సినిమాకి సంబంధించి టికెట్ల రేటు పెంపును కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ .600 రూపాయలుగా నిర్ధారించారు. ఆ తర్వాత 3 రోజులపాటు సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లకు రూ.100. రూపాయలు చొప్పున పెంచుకొని సదుపాయం కల్పించారు.టికెట్ల పెంపు పైన వచ్చే రెవెన్యూలో మాత్రం 20% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇవ్వాలనే జీవోని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి