నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను ఈ రోజు అనగా డిసెంబర్ 4 వ తేదీన రాత్రి నుండి ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణం గానే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను చాలా ప్రాంతాలలో ఓపెన్ చేశారు. ఇక ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కు దాదాపు 600 రూపాయల టికెట్ ప్రైస్ ఫిక్స్ చేశారు. 600 రూపాయల టికెట్ ధర ఉన్నా కూడా అనేక మంది ఈ సినిమా ప్రీమియర్ షో లను చూడాలి అనే ఉద్దేశంతో టికెట్ బుకింగ్ చేసుకున్నారు. ఇక సినిమా ప్రీమియర్ షో లు మరికొన్ని గంటల్లో ప్రారంభం అవుతాయి అని ఎంతో ఆశ్రుతగా ఎదురు చూస్తున్న వారికి సడన్గా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది.

ఈ సినిమాలను ప్రదర్శించడం లేదు , టెక్నికల్ ఇష్యు కారణంగా నిలిపివేస్తున్నాం అని అధికారికంగా ప్రకటించింది. దీనితో ఒక్క సారిగా బాలయ్య అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అఖండ 2 మూవీ నిర్మాతలు దాదాపు 40 కోట్ల వరకు ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు నిర్మాతలు క్లియర్ చేయడం కష్టం అని , దానితో సినిమా రేపు అయినా విడుదల అవుతుందా అనే అనుమానాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. దానితో చాలా మంది ఈ రేంజ్ కష్టాల నుండి సినిమాలు బయట పడేయాలి అంటే బాలకృష్ణ రంగం లోకి దిగాల్సిందే అని , బాలయ్య రంగం లోకి దిగితేనే ఈ సినిమా కనీసం రేపైనా విడుదల అయ్యే అవకాశాలు ఉంటాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: