నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యే అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందించారు. అలాగే బాలయ్య , బోయపాటి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సింహా , లెజెండ్ , అఖండ మూడు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను సాధించడం , వీరి కాంబో లో రూపొందిన నాలుగోవ సినిమా అఖండ 2 కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను నిన్న అనగా డిసెంబర్ 4 వ తేదీన ప్రదర్శన కావాల్సింది. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇకపోతే తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... కొన్ని సినిమాల రన్ టైం మూడు గంటలకు మించి ఉంటుంది. అవసరం లేకపోయినా అంత రైన్ టైం ఉండే విధంగా కొంత మంది దర్శకులు సినిమాను మరి లాగుతున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో సినిమా రన్ టైం అనేది కాస్త తక్కువ ఉంటేనే బెటర్. సినిమాకు ఎంత రన్ టైం ఉంటే బాగుంటే అంత రన్ టైమ్ ఉంటే మరింత బెటర్ అని బాలయ్య వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే అఖండ 2 మూవీ 2 గంటల 45 నిమిషాల నిడివిటో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: