సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు కెరియర్ బిగినింగ్ తో పోలిస్తే కొన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాక వారు చాలా మారి పోతూ ఉంటారు. కొంత మంది కెరియర్ ప్రారంభించిన టైం తో పోలిస్తే కొన్ని సంవత్సరాలు ముగిశాక అస్సలు గుర్తు పట్టలేని రీతిలో మారిపోతూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈయన జోష్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు అయినటువంటి కార్తిక హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. వాసు వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయిన నాగ చైతన్య ,  కార్తీక మాత్రం ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 

ఇక కార్తీక "జోష్" మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన దమ్ము అనే మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తమిళం లో ఈమె నటించిన రంగం మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. అందులో ఈమె ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో మారిపోయింది. కార్తీక ఎన్నో సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: