చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లు అయితే తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా , దర్శకులుగా కెరియర్ను కొనసాగించిన వారు అనేక మంది సంవత్సరానికి కనీసంలో కనీసం రెండు , మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే వారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏ మాత్రం కనబడడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా , దర్శకులుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కనీసం సంవత్సరానికి ఒక్కో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాని సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇలా సంవత్సరానికి కనీసం ఒక్కో సినిమాను కూడా స్టార్ హీరోలు , దర్శకులు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాకపోవడానికి ప్రధాన కారణం స్టార్ కాంబినేషన్ల కోసం ఎదురు చూడడమే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఒక స్టార్ హీరో ఒక సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయకుండా ఒక దర్శకుడి కోసం వెయిట్ చేస్తూ ఉండటం వల్ల ఆ దర్శకుడు తాను ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయ్యి , ఆ తరువాత మరో కథను రెడీ చేసి అంత సెట్ అయ్యి సినిమాను స్టార్ట్ చేసి విడుదల చేసే వరకు చాలా కాలం పడుతుంది.

అలాగే ఓ దర్శకుడు ఓ హీరోతో సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యి ఆ హీరో కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఆయన సమయం అంతా వృధా అవుతుంది అని , ఇక వారిద్దరి కాంబోలో సినిమా సెట్ అయ్యి , ఆ మూవీ పూర్తి అయ్యి , విడుదల కావడానికి సమయం పడుతుంది అని , ఇలా కాంబినేషన్ల కోసం , ఓ హీరో కోసం , ఓ దర్శకుడి కోసం ఎదురు చూడటం వల్ల సమయం వృధా అయ్యి ఒక స్టార్ హీరో లు , దర్శకులు సంవత్సరానికి ఒక్కో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోతున్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: