సినీ నటులంటే చాలామంది గ్లామర్,ఎక్కువగా విలాసవంతమైన జీవితలు,నిరంతరం పార్టీలు వంటివి అనుకుంటారు. కానీ నటీనటులు తెర వెనుక తమ ఆరోగ్యం, వ్యక్తిగత విశ్వాసాల కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వాటిలో మాంసాహారాన్ని కూడా చాలామంది సెలబ్రిటీలు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పటికే చాలా ఇండస్ట్రీలలో మాంసాహారాన్ని వదిలేసిన సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొంతమంది స్టార్ సెలబ్రిటీలు మాంసాహారాన్ని పూర్తిగా వదిలిపెట్టి శాఖాహారులుగా మారారు. అలా మారడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి.



ఈ మార్పు కి బాలీవుడ్ లెజెండ్రి నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఆయన కొన్నేళ్ల నుంచి శాకాహారిగానే ఉన్నారు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడం , శరీరం ఎక్కువ బరువు ఉండకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పైన అంతర్జాతీయ సంస్థలు ఈయనను వెజిటేరియన్ సెలబ్రిటీగా కూడా ప్రకటించాయి. ఇప్పుడు అమితాబచ్చన్ బాటలో మరొక హీరోయిన్ కూడా చేరింది ఆమె ఎవరో కాదు ఆలియా భట్.


స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఆలియా భట్ శాకాహారిగా మారారు.పర్యావరణ సృహ, శక్తివంతమైన అనుభూతి కోసమే ఆమె శాఖాహారాన్ని తీసుకుంది. ముఖ్యంగా మాంసాహారం శరీర జీవక్రియ పైన కూడా చాలా ప్రభావం పడుతుందని తెలుసుకున్న తర్వాతే ఈమె నిర్ణయం తీసుకున్నట్లు చాలా సందర్భాలలో తెలిపింది. అలాగే అనుష్క శర్మ, సోనాక్షి సిన్హా వంటి సెలబ్రిటీలు కూడా జంతువు నుంచి తయారుచేసి ఉత్పత్తులను పూర్తిగా వదిలివేసి శాఖాహార పదార్థాలను మాత్రమే తింటున్నారు. మాంసాహారాన్ని వదిలేయడం వల్ల వారు శారీరక, మానసిక ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు  ఉన్నాయని వాటిని వదిలేసారు. మరి కొంతమంది సెలబ్రిటీలు జంతువుల హక్కులు, పెంపకం వంటి వాటి పట్ల అవగాహన పెంచుతూ సోషల్ మీడియాలో అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. మరి ఈ మార్పు ఎంతవరకు తీసుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: