తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ–"ఈ సంవత్సరం ‘హరిహర వీర మల్లు’, ‘అఖండ 2’ చిత్రాల విడుదల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. దీనికి ప్రధాన కారణం గతంలో నిర్మాతలు వేసుకున్న ఆర్థికపరమైన కమిట్‌మెంట్లు. ‘హరిహర వీరమల్లు’ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిన వెంటనే ఆ సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ‘అఖండ 2’ సమస్య కూడా పరిష్కార దశలోకి చేరింది. నా అంచనా ప్రకారం డిసెంబర్ 12న విడుదల అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు గట్టిగా ఎదురుచూస్తున్న సినిమా కావడంతో, మేకర్స్ సాధ్యమైనంత త్వరగా విడుదలకు ప్రయత్నిస్తారు’’ అంటూ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ–ఒక పెద్ద సినిమా నిర్దిష్టంగా ప్రకటించిన తేదీకే విడుదలైతే ప్రేక్షకుల ఉత్సాహం వల్ల మొదటి రోజు కలెక్షన్లలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ఆ రోజు కలెక్షన్స్‌లోనే సుమారు రూ.3 కోట్లు నుండి రూ.4 కోట్లు వరకు వ్యత్యాసం రావచ్చు. అంతేకాదు ఇటువంటి భారీ సినిమాల విషయంలో ఎక్కువగా మొదటి మూడు రోజులే అత్యంత కీలకమైనవి. మంచి టాక్ వచ్చినా… రాని పరిస్థితిలోనూ ప్రాముఖ్యమైన బాక్స్ ఆఫీస్ ఆదాయం మొదటి మూడు రోజుల్లోనే వస్తుంది"అన్నారు.
డిసెంబర్ 12 విడుదల వార్తలు బలంగా వినిపించడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీనితో మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘అఖండ 2’ అసలుగా డిసెంబర్ 5న విడుదల కావాల్సి వచ్చింది. అయితే చివరి దశలో ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని ఇబ్బందులు పరిష్కార దశలోకి రావడంతో సరికొత్త తేదీగా డిసెంబర్ 12ను ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి