తెలుగు సినీ పరిశ్రమ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులుగా కేరి ర్ను కొనసాగిస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి , సుకుమార్ , సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఐదుగురు కూడా అద్భుత మైన క్రేజ్ కలిగిన దర్శకులుగా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు . వీరు ఏ హీరోతో సినిమా చేసిన ఆ సినిమాలకు వీరి ద్వా రా మంచి గుర్తింపు రావడం , వీరి క్రేజ్ ద్వారా సినిమాలకు మంచి బిజినెస్ లు జరగడం , అలాగే జనాలు కూడా వీరు సినిమాలపై పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉండడంతో వీరికి పెద్ద మొత్తంలో పారితోషకాలను ఒక్కో సినిమాకి నిర్మాతలు ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది . ఇక వీరు ఒక్కో సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే దానిపై ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ప్రకారం వీరు ఒక్కో సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న తెలుగు దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ప్రథమ స్థానంలో ఉంటారు. రాజమౌళి ప్రస్తుతం దాదాపు ఒక్కో సినిమాకు 200 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు , అలాగే లాభాలలో 30% వరకు కూడా పారితోషకంగా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సుకుమార్ ఒక్కో సినిమాకు 165 కోట్ల భారీతోషకాన్ని అలాగే లాభాల్లో 30% వాటాను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగ ఒక్కో సినిమాకి 115 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఒక్కో సినిమాకు 35 కోట్ల పారితోషం అందుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: