మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ వారు పక్కా స్ట్రాటజీ తో ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేస్తూ వస్తున్నారు.

కొంత కాలం క్రితం ఈ సినిమా నుండి మేకర్స్ ఓ వీడియోని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం మొదటి సింగిల్ ను విడుదల చేయగా దానికి కూడా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీ బృందం వారు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన రెండవ సింగిల్ అనౌన్స్మెంట్ ను డిసెంబర్ 16 వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ లోని మొదటి సింగిల్ అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా లోని రెండవ సాంగ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలోని రెండవ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: