టాలీవుడ్ యువ నటుడు రోషన్ కనకాల తాజాగా మొగ్లీ అనే సినిమా లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కలర్ ఫోటో మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. బండి సరోజ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ తేదీన అఖండ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో మోగ్లీ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన కాకుండా 13 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు , అలాగే ఈ మూవీ ని రన్ టైం ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఏకంగా 160 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ రావడంతో చాలా మంది షాక్ అవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ కి భారీ రన్ టైం కూడా ఫిక్స్ చేయడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది అని కూడా అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: