గత కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైన నటి శ్యామల తన కూతురుతో కలిసి ఒక హోమ్ లో నివసిస్తోంది. ఇటీవల తన కూతురికి ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ కావడంతో శ్యామల కదలలేని పరిస్థితి చేరింది. మంచానికే పరిమితం కావడంతో ఈ తల్లి కూతుర్లుకు సేవలు చేయలేమంటూ సదరు హోమ్ నిర్వాహకులు కూడా వారిద్దరిని బయటకి పంపించినట్లు సమాచారం. దీంతో తమను ఆదుకునే వారు లేక నిరాశలో కృంగిపోయిన నటి శ్యామల దిక్కుతోచక ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా ఒక వార్త వైరల్ గా మారింది.
రోడ్డుపై దయనీయ పరిస్థితుల్లో ఉన్న వీరిని చూసిన పోలీస్ అధికారి తిరుమలగిరి ఏసీబీ రమేష్ వెంటనే స్పందిస్తూ ఈ తల్లి కూతుర్లను RK. ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్లో చేర్పించారు. అనంతరం అటు శ్యామలతో పాటు ఆమె కూతురికి కూడా అక్కడ ఆశ్రమం కల్పించి సేవలు అందిస్తామంటూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు కూడా తెలియజేశారు. సుమారుగా 300 చిత్రాలలో నటించిన శ్యామల వెండితెర పైన కామెడీ టైమింగ్ తో బాగానే పేరు సంపాదించింది. అయితే గత కొన్ని నెలలగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోందనే ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు కూడా ప్రస్తావించింది. అయితే తాను తన కూతురు కోసమే బ్రతుకుతున్నానని.. తన కూతురికి చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేవని ఆదుకోమని ఎంతో మందిని వేడుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి