తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు సంపాదించిన బిగ్ బాస్ షో లోకి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నవారు ఉన్నారు. అయితే అలా పాల్గొన్న సెలబ్రిటీలు సైతం తమ కెరీయర్ కు ఇదే మైనస్ గా మారిందంటూ తెలియజేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వారి లిస్ట్ లోకి తాజాగా ప్రముఖ నటిగా పేరు సంపాదించిన కరాటే కళ్యాణి కూడా చేరారు. కరాటే కళ్యాణి ఎన్నో చిత్రాలలో తన నటనతో ,కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకుంది.



సినిమాలలో అవకాశాలు ఎక్కువగా వస్తున్న సమయంలో  బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన కరాటే కళ్యాణి అనుకోకుండా బయటికి వచ్చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ వల్ల తాను చాలా నష్టపోయానంటూ తెలియజేసింది. చాలా మందికి బిగ్ బాస్ షోకి వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుందనుకుంటారు. కానీ తనకు మాత్రం అలా జరగలేదని ,బిగ్ బాస్ షోకి వెళ్లడం వల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని అక్కడ వచ్చిన దానికంటే రెండింతలు ఎక్కువగా నష్టపోయాను అంటూ తెలిపింది.


బిగ్ బాస్ షో అగ్రిమెంట్ వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని సినిమాలు లేవు, అవకాశాలు లేవు అందుకు ప్రధాన కారణమే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం.. హౌస్ లోకి వెళితే సినిమా అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేశారు. కానీ  హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత  ఎవరు పట్టించుకోలేదని తెలియజేసింది. అలా తాను బిగ్ బాస్ వల్ల ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యానంటూ కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ 9 వ సీజన్ టెలికాస్ట్ అవుతోంది. మరో కొద్ది రోజులలో విన్నర్ ఎవరని విషయం కూడా తేలనుంది. మరి రాబోయే రోజుల్లోనైనా కరాటే కళ్యాణికి అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: