టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకులలో మారుతి ఒకరు కాగా సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటన వెలువడిన సమయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. అయితే అలా తిట్టకపోతే తాను ది రాజాసాబ్ మూవీ తీసేవాడిని కాదని ఆయన అన్నారు.
ట్రోలర్స్ నిజంగా పనులన్నీ మానుకుని మనకోసం సమయం కేటాయించి పాజిటివిటీ చంపుకుని బ్రెయిన్ లోకి నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని నాలుగు తిట్లు తిడుతున్నారని పాపం వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివిటీని పంచుతున్నారని ఆయన కామెంట్లు చేశారు. వాళ్ళ దగ్గర నాలుగు బూతు మాటలు, నాలుగు తిట్లు మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.
మీరు కూడా మిమ్మల్ని తిట్టేవాళ్ళని వెతుక్కోవాలని లేకపోతే మీరు ఏమీ సాధించలేరని ఆయన వెల్లడించారు. అలా ట్రోలర్స్ మాకు ఎనర్జీ ఇస్తుంటే మేము ఎదుగుతూనే ఉంటామని మారుతి పేర్కొన్నారు. మీరు మాత్రం అక్కడే ఉంటారని గుర్తు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లందరికి థ్యాంక్స్ అని మీరు లేకపోతే మేము లేమని సాధించలేమని ఆయన వెల్లడించారు. మారుతి ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నారని సమాచారం అందుతోంది. రాజాసాబ్ మూవీ సక్సెస్ సాధిస్తే మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మారుతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి