తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్స్ బుకింగ్స్ విషయంలో కొంత ఆలస్యమైన తాజాగా 11:00 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఈ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం క్షణాలలో హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అయ్యాయి.. ఇప్పటికే నైజాం మొదటి అడ్వాన్స్ బుకింగ్స్ రూ.5.25 కోట్లు దాటినట్లుగా వినిపిస్తోంది. వీటికి తోడు ప్రీమియర్స్ తోడైతే మాత్రం భారీగానే మొదటి రోజు కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు రూ .16 కోట్ల రూపాయలు అడ్వాన్స్ సేల్స్ దాటినట్లుగా తెలియజేస్తున్నాయి.
ఏది ఏమైనాప్పటికీ బాలయ్య , బోయపాటి కాంబినేషన్లో మాస్ సినిమా ఎలా ఉంటుందో అని మరొకసారి అడ్వాన్స్ టికెట్లతోనే రుజువు చేశారు. మరికొన్ని గంటలలో ప్రీమియర్స్ షో కూడా పడబోతున్నాయి. బాలయ్య ,బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా విజయం సాధించి ఎలాంటి సునామి సృష్టిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఆలస్యమైంది. అయితే ఈ ఆలస్యం కూడా బాలయ్య సినిమాకి భారీగానే కలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, పూర్ణ తదితర నటీ నటుల సైతం నటిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి